కాళోజీ సెంటర్: హైదరాబాద్‌లో ఇటీవల ఆర్‌ఈఏ (రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్) తెలంగాణ రాష్ట్ర సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కందుకూరి దేవదాస్‌ను అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. హనుమకొండ నుంచి పి.సంజీవరెడ్డి, ఎ.సురేందర్, వరంగల్ నుంచి టి.రఘువీర్, ఎండీ మహబూబు అలీ, మహబూబాబాద్ నుంచి ఆర్వీ చలం జ.కిషన్, ఎస్.గోవర్ధన్, జనగామ నుంచి మిర్యాల రమేశ్‌కు రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించినట్లు దేవదాస్ తెలిపారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల కోసం పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు.


