పేకాట శిబిరంపై దాడి | - | Sakshi
Sakshi News home page

పేకాట శిబిరంపై దాడి

May 19 2026 1:28 AM | Updated on May 19 2026 1:28 AM

వరంగల్‌ క్రైం: సుబేదారి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇందిరానగర్‌లో సోమవారం పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్‌ అధి కారులు దాడి చేసినట్లు ఏసీపీ ఎ.మధుసూదన్‌ తెలిపారు. విశ్వసనీయ సమాచా రం మేరకు పేకాట శి బిరంపై దాడులు చేసి పేకా టరాయుళ్ల నుంచి రూ.1,19,150 నగదు, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందిరానగర్‌కు చెందిన రవీందర్‌, పాలకుర్తికి చెందిన మనోహర్‌, రఘు, సత్యనారాయణ, హుజూ రా బాద్‌కు చెందిన కోటేశ్వర్‌, అనంతసాగర్‌కు చెందిన రత్నాకర్‌రెడ్డి, జనగామకు చెందిన లింగమూర్తి, నవీన్‌, ములుగురోడ్డుకు చెందిన గోపి పట్టుబడినట్లు తెలిపారు. దాడుల్లో సీఐ బాబులాల్‌, ఆర్‌ఎస్సై భానుప్రకాశ్‌, ఎస్సై ఉప్పలయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement