మెడికల్‌షాపుల బంద్‌ను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌షాపుల బంద్‌ను విజయవంతం చేయాలి

May 19 2026 1:28 AM | Updated on May 19 2026 1:28 AM

రామన్నపేట : ప్రజారోగ్య పరిరక్షణ, కెమిస్ట్రీ భవి ష్యత్‌ కోసం ఆల్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కె మి స్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌ ఆధ్వర్యంలో ఈనెల 20న చేపట్టే దేశవ్యాప్త మెడికల్‌ షాపుల బంద్‌ను విజయవంతం చేయాలని హనుమకొండ జిల్లా కెమిస్ట్‌ అండ్‌ డ్ర గ్గిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాస్‌ పిలు పునిచ్చారు. సోమవారం బంద్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ నాయకులతో కలిసి ఆయన ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడు తూ తమ ప్రధాన డిమాండ్ల అయిన కోవిడ్‌ కాలంలో జారీ చేసిన తాత్కాలిక నోటిఫికేషన్‌ జీఎస్‌ఆర్‌ 220(ఈ) ను వెంటనే ఉపసంహరించాలని, ఈ– ఫార్మసీలకు సంబంధించిన జీఎస్‌ఆర్‌ 817(ఈ) నో టిఫికేషన్‌ను రద్దు చేయాలని, కార్పొరేట్‌ సంస్థల అనైతిక డిస్కౌంట్లను అరికట్టేందుకు ‘లెవెల్‌ ప్లే యింగ్‌ ఫీల్డ్‌‘ విధానాన్ని అమలు చేయాలని కో రారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.మధుకర్‌రా వు, కోశాధికారి శ్రీని వాస్‌, ఉపాధ్యక్షులు ప్రభాకర్‌, జాయింట్‌ సెక్రటరీ కె.వెంకటరాఘవరెడ్డి,లక్ష్మ య్య, అనిల్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement