యువతలో సృజనాత్మకతను పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

యువతలో సృజనాత్మకతను పెంపొందించాలి

May 19 2026 1:28 AM | Updated on May 19 2026 1:28 AM

హన్మకొండ అర్బన్‌ : యువతలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు పర్యాటక, యువజన–క్రీడా వా రోత్సవాల దోహదపడతాయని హనుమకొండ అదనపు కలెక్టర్‌ రవి పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 18 నుంచి 23 వరకు నిర్వహించనున్న ప ర్యాటక వారోత్సవాలు, యువజన–క్రీడా వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లు, బ్రోచర్లను ఆయన సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ యువతలో పర్యాటక రంగంపై అవగాహన పెంపొందించడం, స్థానిక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, పరిరక్షణలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలి పా రు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘యువ టూ రిజం క్లబ్‌’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టూరిజం అ ధికారి శివాజీ, టూరిజం ప్రమోషన్‌ అధికారి సూర్యకిరణ్‌, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి

Advertisement
 
Advertisement
Advertisement