ఖిలా వరంగల్ : ఉర్సు జాగీర్ వక్ఫ్ భూములను పరిరక్షించాలని హజ్రత్ జిందా బిక్కన్ దర్వేష్ దర్గా, మసీద్ పరిరక్షణ కమిటీ బాధ్యులు మహమ్మద్ జైనుల్లా అబిదీన్ డిమాండ్ చేశారు. వరంగల్ కరీ మాబాద్‌లోని హజ్రత్ జిందా బిక్కన్ దర్వేష్ దర్గా, మసీద్ ప్రాంగణలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హజ్రత్ జిందా బిక్కన్ దర్వేష్ దర్గా, మసీద్ చెందిన 5 ఎకరాల భూమి అధికారికంగా వక్ఫ్ ఆస్తిగా గెజిట్‌లో నమోదై ఉన్నట్లు తెలిపారు. అయితే కొందరు వ్యక్తులు ఆ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేప ట్టడమే కాకుండా వెంచర్లుగా మార్చి విక్రయాలు జ రుపుతున్నట్లు ఆరోపించారు. ప్రస్తుతం ఆ భూముల్లో వేసిన సెల్‌ఫోన్ టవర్‌తో పాటు పలు అక్రమ నిర్మాణాలు వెంటనే తొలిగించాలని, టవర్ ద్వారా వచ్చే నెలవారీ ఆదాయాన్ని దర్గా అభివృద్ధి, నిర్వహణకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మహమ్మద్ అలీ, మహమ్మద్ రఫీక్, అమీర్, అలీపాషా ఖాద్రీ, రియాజ్, అబ్దుల్ రెహమాన్, యూసుఫ్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.


