సీపీఎం ఆందోళన | - | Sakshi
Sakshi News home page

సీపీఎం ఆందోళన

May 19 2026 1:28 AM | Updated on May 19 2026 1:28 AM

కాజీపేట : కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చే స్తూ కాజీపేట మున్సిపల్‌ సర్కిల్‌ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. సీపీఎం మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య ఆధ్వర్యంలో సోమవారం కార్యకర్తలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మతో పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కొ ద్దిసేపు రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. అనంతరం పిఎం మోదీ దిష్టిబొమ్మను కార్యకర్తలు దహనం చేశారు. కార్యక్రమంలో కారు ఉపేందర్‌, తొట్టె మ ల్లేశం, జంపాల రమేష్‌, సంటి రవి, రామస్వామి, రాజేందర్‌, ప్రదీప్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement