ఆధునికీకరించిన ఆఫీస్‌లోకి రిజిస్ట్రార్‌ | - | Sakshi
Sakshi News home page

ఆధునికీకరించిన ఆఫీస్‌లోకి రిజిస్ట్రార్‌

May 19 2026 1:28 AM | Updated on May 19 2026 1:28 AM

కేయూ క్యాంపస్‌ : కాకతీ య యూనివర్సిటీలోని ప రిపాలనా భవనంలోని మొదటి అంతస్తులో నూతనంగా ఆధునికీకరించిన ఆఫీస్‌ను రిజిస్ట్రార్‌ ప్రొఫె సర్‌ వి.రామచంద్రం సో మవారం ప్రారంభించారు. పాత వీసీ చాంబర్‌ను ఆధునీకరించగా అందులోనికి రిజిస్ట్రార్‌ చాంబర్‌, పేషీగా మార్చారు. ఇక నుంచి ఈ ఆ ఫీస్‌లోనే రిజిస్ట్రార్‌ బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రార్‌ చాంబర్‌, పేషీని ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్‌డీ) ఇటీవలే నియమితులైన వెంకట్రామ్‌రెడ్డికి కేటాయించారు. వీసీ ప్రొఫెసర్‌ కె.ప్రతాప్‌రెడ్డి ఆయా చాంబర్లకు వెళ్లి రిజిస్ట్రార్‌కు, వెంకట్రామ్‌రెడ్డికి పూలబోకేల ను అందజేసి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement