కాజీపేట : మహిళలు జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైన ఆత్మస్తైర్యాన్ని కోల్పోవద్దని సఖి సెంటర్ లీగల్ కౌన్సిలర్ శ్రీదేవి అన్నారు. పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవనంలో సోమవారం సఖి ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత మహిళలకు అన్ని వేళల్లో చేయూతనందించడానికి సఖి వన్‌స్టాప్ సెంటర్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలకు ఇబ్బందులు కలిగితే 181, 100, 1098 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించారు. అనంతరం సఖి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో సోషల్ వర్కర్ అనూష, లక్ష్మి, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.


