ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సత్యనారాయణ | - | Sakshi
Sakshi News home page

ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సత్యనారాయణ

May 19 2026 1:28 AM | Updated on May 19 2026 1:28 AM

హన్మకొండ : బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా హనుమకొండకు చెందిన కందగట్ల సత్యనారా యణను నియమించారు. ఏబీవీపీ నుంచి చురుకై న కార్యకర్తగా పనిచేస్తున్న సత్యనారాయణ బీజేపీ జిల్లా కమి టీలో వివిధ హోదాల్లో పని చేశారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ రాష్ట్ర అధిష్టానం ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమించింది. సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తనను నియమించిన రాష్ట్ర నాయకత్వానికి, సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

నేడు విద్యుత్‌

ఉండని ప్రాంతాలు

హన్మకొండ : హనుమకొండలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 19న విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్‌ హ నుమకొండ టౌన్‌ డీఈ జి.సాంబరెడ్డి తెలి పారు. విష్ణుపురి మెయిన్‌రోడ్‌, సోమిడిలోని ఉప్పలయ్య డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రాంతంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు.

వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్‌ వరంగల్‌ టౌన్‌ డీఈ శెంకేశి మల్లికార్జున్‌ తెలిపారు. స్తంభంపల్లి, ధర్మారం ప్రాంతంలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు.

చేయూత

హసన్‌పర్తి: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చల్లా బతుకయ్య–లక్ష్మి దంపతుల కుటుంబానికి హసన్‌పర్తిలోని జిల్లా పరిషత్‌ పాఠశాల (1995–96 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌) విద్యార్థులు సోమవారం కేశవాపూర్‌లోని మృతుడి స్వగ్రామానికి వెళ్లి రూ.35వేలు ఆర్థిక సాయం చేశారు. స్థానిక సర్పంచ్‌ మోత్కుపల్లి శ్రీకాంత్‌రెడ్డి, ఇమ్మడి రాజేందర్‌, చాతళ్ల వేణుగోపాల్‌, నేదునూరి సంపత్‌, ఆరెపల్లి సదానందం, వెంకటేశ్వర్లు, అశోక్‌, రాజమౌళి, అశోక్‌, శ్యాంసుందర్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

23 వరకు సెల్ఫ్‌

రిపోర్టింగ్‌ సమర్పించాలి

కేయూ క్యాంపస్‌ : డిగ్రీ కోర్సుల్లో ఈవిద్యా సంవత్సరం 2026–27లో దోస్త్‌ ద్వారా మొదటి దశలో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌కళాశాలలో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 23 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ను స మర్పించాలని కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.జ్యోతి సోమవారం కోరారు. మొదటిదశలో కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఏ ఆనర్స్‌, బీఏ జర్నలిజం తదితర కోర్సుల్లో మొత్తం 1225 మంది విద్యార్థులకు సీట్లు లభించాయని ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసేందుకు ఈనెల 23 వరకు గడువు ఉందన్నారు. రిపోర్టింగ్‌ చేసిన విద్యార్థులకే అడ్మిషన్‌ ప్రక్రియను పూ ర్త్తయినట్లుగా పరిగణిస్తారని తెలిపారు. రెండోదశలో ఈనెల 25వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందన్నారు.

లీడ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు ప్రదానం

హన్మకొండ కల్చరల్‌ : నగరానికి చెందిన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృసంఘం ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యకు లీడ్‌ ఫౌండేషన్‌ లీడ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డును ప్రదానం చేశారు. ఆదివారం నర్సంపేటలో లీడ్‌ ఫౌండేషన్‌ 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో కృషి చేస్తున్న పలువురికి ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు కాసుల రవికుమార్‌, శోభారాణి దంపతులు ఎక్సలెన్స్‌ అవార్డులతో సత్కరించారు. ఇందులో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చొల్లేటి కృష్ణమాచా చా ర్యకు లీడ్‌ ఎక్సలెన్స్‌ అవార్డు ప్రదానం చేశారు.

పెన్షన్‌ త్వరగా అందించాలి

హన్మకొండ : ఆలస్యంగా లైఫ్‌ సర్టిఫికెట్‌ అందించిన పెన్షనర్లకు వెంటనే పెన్షన్‌ మంజూరు చేయాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ హనుమకొండ జి ల్లా అధ్యక్షుడు తూపురాణి సీతారాం, ప్రధాన కార్యదర్శి నారాయణగిరి వీరన్న కోరారు. ట్రెజరీ కార్యాలయం పరిధిలో ఆలస్యంగా లైఫ్‌ సర్టిఫికెట్‌ అందించిన 698 మంది పెన్షనర్ల సప్లిమెంటరీ బిల్లులు ఫైనాన్స్‌ విభాగానికి పంపామన్నారు. ఇవి ఎప్పుడు మంజూరై వ స్తాయో తమకు తెలియదని ట్రెజరీ అధికారులు చెప్పుతున్నారని వారు సోమవారం ఒక ప్ర కటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి సప్లిమెంటరీ బి ల్లు మంజూరు చేసి పెన్షన్‌ అందించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement