కాజీపేట జంక్షన్‌లో గంజాయి పట్టివేత
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్‌లో స్పెషల్ రై లులో సోమవారం పోలీసులు అక్రమంగా తరలి స్తున్న గంజాయిని పట్టుకొని స్వాధీనం చేసుకున్నా రు. పోలీసులు, ప్రయాణికుల కథనం ప్రకారం.. కాజీపేట జంక్షన్–బల్లార్షకు వెళ్తున్న ప్రత్యేక రై లులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీసులు అనుమానాస్పద బ్యాగులు, లగేజీలను తనిఖీ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అట్టా బాక్సుల్లో తరలిస్తున్న సుమారు 5 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయిని తరలిస్తున్న వారు ఎవరు లేకపోవడంతో గంజాయిని స్వాధీనం చేసుకొని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ తనిఖీల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
డ్రంకెన్ డ్రైవ్‌లో జరిమానా రూ.1.12 లక్షలు
వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ ట్రైసిటీ పరిధిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈనెల 17న నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ పరీక్షలో మ ద్యం సేవించి వాహనాలు నడిపి 89 మంది వాహనదారులు పట్టుబడినట్లు ట్రాఫిక్ ఏసీపీ సత్యనారా యణ తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా రూ.1,12,300 జరిమాన విధించినట్లు ఆయన తెలి పారు. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులకు రూ. 10,800 జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. ట్రైసిటీలో ఇకపై ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్న, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకున్నా, మైనర్లకు వాహనాలు ఇచ్చినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
బైక్‌లు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ఖిలా వరంగల్: రెండు బైకులు అతివేగంగా ఎదురురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం సాయంత్రం ఖిలా వరంగల్ వాకింగ్ గ్రౌండ్ సమీపంలోని రోడ్డుపై చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కీర్తినగర్‌కు చెందిన ఎండీ. సోహెల్ వరంగల్‌కు చెందిన విఘ్నేష్ సోమవారం సాయంత్రం వాకింగ్ రోడ్డుపై ఎదురురెదురుగా రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సమాచా రం ఇవ్వటంతో 108 వాహనం ఘటన స్థలానికి చే రుకొని క్షతగాత్రులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
దాడి ఘటనలో వ్యక్తిపై కేసు
హసన్‌పర్తి : మండలంలోని వంగపహాడ్‌లో ఆది వారం రాత్రి బీరుసీసాతో దాడి చేసిన ఘటనలో అదే గ్రామానికి చెందిన రాకేష్‌పై కేసు నమోదైనట్లు ఇన్‌స్పెక్టర్ మహేందర్ తెలిపారు. గ్రామంలో బీ రన్న ఉత్సవాలు సందర్భంగా కొరే కుమారస్వామి తన ఇంటిలో వేడుకలు నిర్వహిస్తున్నారు. బంధువులు, మిత్రులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఓవైపు వేడుకలు జరుగుతుండగా మరో వైపు అదే గ్రామానికి చెందిన గుండబోయిన రాకేష్ మద్యం సేవించి కుమారస్వామి ఇంటి వద్ద న్యూసెన్స్ చేయసాగారు. దీంతో అక్కడే ఉన్న కుమారస్వామి కొ డుకు హృతిరేష్ అతన్ని మందలించాడు. ఈక్రమలో మద్యం మత్తులో ఉన్న రాకేష్ బీరుసీసాతో దాడి చేసి హృతికేష్‌ను గాయపరిచినట్లు సీఐ చెప్పారు.


