హసన్‌పర్తి : హన్‌పర్తి మీడియా పాయింట్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎల్కరాజు సదానందం, ఉపాధ్యక్షులుగా రాజ్‌కుమార్, దాడి భిక్షపతి, ప్రధానకార్యదర్శిగా గరిగె శ్రీనివాస్, కోశాధికారిగా దాడి చిరంజీవి, కార్యవర్గ సభ్యులుగా కనుకుంట్ల సతీష్, రామంచ మధుకర్, జక్కుల విజయ్, కాందారి విజయ్, ఎండీ.వాజీద, నద్దునూరి బాబులు ఎన్నికయ్యారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
న్యూశాయంపేట : కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ సోమవారం సీఐటీయూ అనుబంధ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ హనుమకొండ జిల్లా కమిటీ ఆద్వర్యంలో స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, కే.ఆర్.నాగరాజులను కలిసి వినతి పత్రాలు అందించారు. వర్కర్లకు ప్రతి నెలా 1వ తేదీన పారి తోషికాలు అందించాలని రూ.18వేల ఫిక్స్‌డ్ వేతనా లు అందించాలని వినతి పత్రంలో కోరారు. వినతి పత్రం అందించిన వారిలో సీఐటీయూ నాయకులు రాగుల రమేష్, యూనియన్ నాయకులు రాజేశ్వరీ, యాకూబి, శోభ, శ్రీవాణి, లీల, పద్మ, తదితరులు ఉన్నారు.
కాశిబుగ్గ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఉద్యమకారుల విజయమని, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో కోరారు. ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి, మలిదశ ఉద్యమంలో అమరవీరుల కుటుంబాలకు నెలకు రూ.25వేల గౌరవ పెన్షన్, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేసి, వారికి 250 గజాల ఇళ్ళస్థలాలు ఇస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.


