పోలీసుల వినూత్న కార్యక్రమం | - | Sakshi
Sakshi News home page

పోలీసుల వినూత్న కార్యక్రమం

May 19 2026 1:28 AM | Updated on May 19 2026 1:28 AM

ఖిలా వరంగల్‌ : పోలీసుల తీరును చూసిన ప్రజలు శభాష్‌ పోలీస్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రజల్లో విశ్వాసం నెలకొనేలా రౌడీషీటర్లకు తమదైన శైలిలో కౌన్సెలింగ్‌ ఇవ్వటమే కాకుండా రోడ్డుపై నడిపిస్తూ వినూత్న కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. ఇంతకాలం వీధుల్లో రౌడీషీటర్ల హల్‌చల్‌ చూసి ప్రజలు పోలీసుల తీరును చూసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో మిల్స్‌కాలనీ ఏరి యా ఎక్కసారిగా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తోంది. ఆకతాయిలు, రౌడీషీటర్ల అగడాలను అరికట్టినట్లేనని అంతా అనుకుంటున్నారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించిన, అల్లర్లు, గొడవలు, భూ తగాదాల్లో తలదూర్చిన చర్యలు ఉంటా యని హెచ్చరించారు. సోమవారం ఉదయాన్నే మిల్స్‌కాలనీ పోలీసులు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌ నుంచి శివనగర్‌లోని తహసీల్దార్‌ కార్యాలయం వరకు రౌడీషీటర్లను రోడ్డుపై ప్రజలందరు చూసేలా కవాతు నిర్వహించారు. తహసీల్దార్‌ ఇక్బాల్‌ ఎదుట రౌడిషీటర్లను బైండోవర్‌ చేశారు. ఇప్పటికై నా రౌడీషీటర్ల పద్ధతులు మా ర్చుకొని భార్య పిల్లలు, కుటుంబంతో కలిసి కష్టపడి పనిచేసుకుంటూ జీవనం సాగించాలని సూచించారు. అమాయక ప్రజలను బెదిరింపులకు పాల్ప డితే చర్యలు తప్పవని ఇన్‌స్పెక్టర్‌ బొల్లం రమేశ్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సైలు మహేష్‌, శ్రీకాంత్‌, నరేష్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

రోడ్డుపై రౌడీషీటర్లతో కవాతు

తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌

Advertisement
 
Advertisement
Advertisement