కలెక్టర్‌ ఇచ్చిన గెజిట్‌ను అడ్డుకోవడం సరైంది కాదు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ ఇచ్చిన గెజిట్‌ను అడ్డుకోవడం సరైంది కాదు

May 19 2026 1:28 AM | Updated on May 19 2026 1:28 AM

హన్మకొండ అర్బన్‌ : గత ఏడాది మే 24న హనుమకొండ జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల డైలీవేజ్‌ కార్మికుల వేతనాలను రోజుకు రూ.651గా సవరించి గెజిట్‌ విడుదల చేయగా గెజి ట్‌ ప్రకారం కార్మికులకు పెరిగిన వేతనాలు అమలు చేయకుండా నగర అసిస్టెంట్‌ కమిషనర్‌ అడ్డుకోవడం సరైంది కాదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు టి.ఉప్పలయ్య అన్నారు. గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న హార్టికల్చర్‌ కార్మికులకు ఆ గెజిట్‌ ప్రకారం వేతనాలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పలయ్య మాట్లాడుతూ హార్టికల్చ ర్‌, మలేరియా, వాటర్‌ సప్లై విభా గాల్లో పనిచేస్తున్న డైలీవేజ్‌ కార్మికులకు పెరిగిన వేతనాలు అమలు చేయాలని ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ దృష్టికి తీ సుకెళ్లిన వెంటనే సంబంధిత అధికారులకు ఫైళ్లు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. మలేరియా విభాగ ఇనన్‌చార్జ్‌ అధికారి సిహెచ్‌.రాజారెడ్డి, హార్టికల్చర్‌ అధికారి రమేష్‌ ఫైళ్లు సిద్ధం చేసి పంపించగా, నగర కమిషనర్‌ సంతకం చేశారని చెప్పారు. అయితే బల్దియా మేయర్‌ మలేరియా విభాగ కా ర్మికుల ఫైల్‌పై మాత్రమే సంతకం చేసి, హార్టికల్చ ర్‌ కార్మికుల వేతనాల పెంపును నిలి పివేశారని విమర్శించారు. ఇప్పుడు నగర కమిషనర్‌, మేయర్‌ ఫైల్‌పై సంతకాలు చేసినప్పటికీ నగర అసిస్టెంట్‌ కమిషనర్‌ అడ్డుకోవడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. హార్టికల్చర్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి కె.రంజిత్‌, జిల్లా అధ్యక్షురాలు ఎం.సునీత, నాయకులు విజయలక్ష్మి, రేవతి, విద్యాసాగర్‌, నరేష్‌ పాల్గొన్నారు.

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పలయ్య

Advertisement
 
Advertisement
Advertisement