హసన్‌పర్తి : ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు అన్నారు. సోమవారం మండలంలోని వంగపహాడ్‌లో నిర్వహించిన బీరన్నస్వామి కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని ఆ యన మాట్లాడుతూ బీరన్నస్వామి ఉత్సవాలు భక్తి విశ్వాసానికి ప్రతిబింబమన్నారు. గ్రామాల్లో ఇ లాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి, పీఏసీఎస్ మాజీ చైర్మన్లు పోలం అనిల్‌రెడ్డి, గండు అశోక్‌యాదవ్, కాంగ్రెస్ డివిజన్ మాజీ అధ్యక్షులు పొన్నాల రఘు, మాజీ ఎంపీసీటీ మార్త రవీందర్, పీఏసీఎస్ పర్సనల్ ఇన్‌చార్జ్ రమేశ్, కురుమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాలు
తెలంగాణ సంస్కృతిక సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అ న్నారు. సోమవారం మండలంలోని జయగిరిలో నిర్వహించిన శ్రీఎల్లమ్మ తల్లి బోనాల వేడుకలకు ఎ మ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని ఆలయంలో ప్ర త్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ ప్రతీ గ్రామంలో అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతంగా అమలు చేస్తానన్నా రు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయాకర్, నాయకులు ప్రభాకర్, పరమేశ్వర్, స్వాతి పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు


