హన్మకొండ చౌరస్తా : ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అ న్నారు. 5వ డివిజన్ పరిధిలోని హనుమాన్‌నగర్‌లో రూ.1 కోటి వ్యయంతో చేపట్టనున్న అంతర్గత రో డ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు సోమవారం ఎ మ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు ఇ బ్బందులు రాకుండా రోడ్లు, డ్రెయినేజీ వంటి మౌలిక సదుపాయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.
పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ సంక్షేమ పాలన అందిస్తోందని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ పరిధిలోని 48 మంది లబ్ధిదారులకు రూ.14,45,500 లక్షల వి లువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనా రోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అత్యవసర వైద్య సహాయం అందిస్తూ ప్రభుత్వం మానవతా ధృక్పథంతో పనిచేస్తోందని ఆయన అన్నారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి


