ప్రాణం తీసిన భూ పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన భూ పంచాయితీ

May 2 2026 7:20 AM | Updated on May 2 2026 7:20 AM

కురవి: అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూమి పంచాయితీ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ ఘటనకు సంబంధించి కురవి ఎస్సై సతీష్‌ తెలిపిన వివరాలు ప్రకారం.. మానుకోట జిల్లా కురవి మండలంలోని నేరడ గ్రామానికి చెందిన చందు శ్రీను, చందు లింగయ్య(52) అన్నదమ్ములు. వీరి మధ్య కొంతకాలంగా భూ పంచాయితీ కొనసాగుతోంది. ఈక్రమంలో లింగయ్య గత నెల 22న కురవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం 24వ తేదీన పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరుగుతున్న క్రమంలో లింగయ్యపై అతని అన్న శ్రీను కుమారులతోపాటు మరికొందరు దాడిచేశారు. దీంతో తీవ్రగాయాలైన లింగయ్యను మానుకోటలోని ఓ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్‌ తెలిపారు.

తమ్ముడిపై అన్న, అతడి కుమారుల దాడి

చికిత్స పొందుతూ మృతి

ఐదుగురిపై కేసు నమోదు

Advertisement
 
Advertisement
Advertisement