కాశిబుగ్గ: ప్రత్యేక అవసరాలున్న పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని హనుమకొండ వైద్యారోగ్యశాఖ అధికారి ఎ.అప్పయ్య సూచించారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చైల్డ్ సేఫ్టీ వీక్‌లో భాగంగా.. ఎంజీఎంలో బాల భరోసా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్ చంద్రారెడ్డి, ఎంజీఎం ఆర్‌ఎంఓ మధుకర్ యాదవ్, జిల్లా సంక్షేమాధికారి ఎం.విశ్వజ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి జ్ఞానేశ్వర్, హనుమకొండ జిల్లా ఆర్‌బీఎస్‌కే నోడల్ అధికారి బి.దుర్గాప్రసాద్, సీడీపీఓలు, ఆర్‌బీఎస్‌కే టీం వైద్యులు, డీ ఈఐసీ సిబ్బంది, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే పిట్ లైన్లను శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ (డీఆర్‌ఎం) గోపాలకృష్ణన్ తనిఖీ చేశారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో అధికారుల బృందంతో కలిసి డీజిల్ షెడ్డు వద్ద రైలు దిగి పిట్ లైన్లను తనిఖీ చేశారు. రైళ్ల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఆర్‌ఎం డీజిల్ కాలనీలోని రైల్వే కమ్యూనిటీ హాల్, రైల్వే చిల్డ్రన్స్ పార్కును తనిఖీ చేశారు. ఈనెల 10న ప్రధాన మంత్రి మోదీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వర్చువల్‌లో ప్రారంభించనున్న నేపథ్యంలో.. రైల్వే కమ్యూనిటీ హాల్‌లో ఉండేందుకు కావాల్సిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. అనంతరం ప్రత్యేక రైలులో డీఆర్‌ఎం కాజీపేట మీదుగా నిజామాబాద్‌కు తనిఖీల నిమిత్తం వెళ్లారు. ఈ తనిఖీల్లో డీఆర్‌ఎం వెంట రైల్వే అధికారులు, రైల్వే నాయకులు పాల్గొన్నారు.
వరంగల్ క్రైం: పోలీసుల వద్దకు వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏసీపీలుగా పదోన్నతి పొందిన గొర్ల సీతారెడ్డి, బోలగాని శ్రీనివాస్‌గౌడ్, సార్ల రాజు శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్‌ను సీపీ క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ గౌరవ మర్యాదలు పెంపొందించేలా విధులు నిర్వర్తించాలని సూచించారు.
కేయూ క్యాంపస్: ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాల సాధనలో నైపుణ్యాలే కీలకపాత్ర పోషిస్తాయని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. కేయూలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో వివిధ బ్రాంచ్‌ల ఫైనల్ ఇయర్ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో వివిధ ఉద్యోగాలు సాధించిన సందర్భంగా.. శుక్రవారం పరిపాలనా భవనంలోని సెనేట్‌హాల్‌లో అభినందన సభ నిర్వహించారు. సుమారు 250 మందిని అభినందించారు. కేయూ రిజి స్ట్రార్ రామచంద్రం, ఆ కళాశాల ప్రిన్సిపాల్ భిక్షాలు, ఓఎస్డీ వెంకట్రామ్‌రెడ్డి, కళాశాల ప్లేస్‌మెంట్ అధికారి బొల్లం కిరణ్, పాలకమండలి సభ్యులు చిర్రరాజు పాల్గొన్నారు.
రామన్నపేట: కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ అయూబ్ శుక్రవారం తన జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ను వేర్వేరుగా కలిశారు. తనకు ఫోన్‌ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డికి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య,శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.


