ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
కాజీపేట: వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి ముఖ ద్వారంగా ఉన్న కాజీపేట పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడానికి కట్టుబడి పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. కాజీపేట 61వ డివిజన్ వడ్డేపల్లి ట్యాంక్‌బండ్‌పై రూ.34.65కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు శుక్రవారం మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. పట్టణంలోని వడ్డేపల్లి ట్యాంక్‌బండ్ పర్యటకులను ఆకర్షించేలా సుందరీకరణ పనులు త్వరగా అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దాస్యం అభినవ్‌భాస్కర్‌తో పాటు మున్సిపల్, ‘కుడా’ అధికారులు పాల్గొన్నారు.
ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో అధిక మార్కులు సాధించిన హనుమకొండ జిల్లాలోని 17 ప్రభుత్వ, జెడ్పీ, కేజీబీవీ విద్యార్థులను శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, అధికారులు సత్కరించారు.
– హన్మకొండ అర్బన్


