ఉద్యమాన్ని గ్రామాలకు విస్తరిస్తాం..
బీసీ రిజర్వేషన్ల సాధనలో భాగంగా తెలంగాణ బీసీ జేఏసీ మౌనదీక్ష
హన్మకొండ: రాజ్యాంగ సవరణ చేసైనా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన పోరాటంలో భాగంగా గురువారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద తెలంగాణ స్టేట్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల ఉద్యమన్ని పల్లెపల్లెకు విస్తరించి భారతీయ జనతా పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. జనవరి 4వ వారంలో లక్ష మందితో ‘వేల వృత్తులు.. కోట్ల గొంతుకలు’ నినాదంతో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. మౌనదీక్షకు లంబాడా హక్కుల పోరాట సమితి, ఎమ్మార్పీఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ జేఏసీ వైస్ చైర్మన్లు దాడి మల్లయ్య యాదవ్, బొనగాని యాదగిరిగౌడ్, నాయకులు తమ్మెల శోభారాణి, మాదం పద్మజాదేవి, తేళ్ల సుగుణ, హైమావతి, కిషోర్, బచ్చు ఆనందం, దాడి రమేశ్ యాదవ్, గొట్టె మహేందర్, డాక్టర్ ఒడితల రాము, తంగళ్లపెల్లి రమేశ్, పంజాల మధుగౌడ్, జ్ఞానేశ్వర్, రజనీకాంత్, పొన్నం సంపత్, చాగంటి రమేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.


