తెలుగు విభాగంలో మరోసారి ఇంటర్వ్యూ రద్దు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని తె లుగు విభాగం పీహెచ్‌డీలో ప్రవేశాలకు గురువారం నిర్వహించనున్న ఇంటర్వ్యూను రద్దు చేశారు. ఆ విభాగంలో సీట్లు రెండే ఉన్నాయని, అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారని, అందుకే సీట్లు పెంచాకే అడ్మిషన్లు నిర్వహించాలని యూనివర్సిటీకి వచ్చిన కొందరు అభ్యర్థులు రిజిస్ట్రార్ వి. రామచంద్రంకు వినతిపత్రం సమర్పించారు. దీంతో ఇంటర్వ్యూను రద్దు చేశారు. కాగా, గతంలో ఇంటర్వ్యూ నిర్వహించగా పలు ఆరోపణలు రావడంతో ఎంపిక జాబితా ను వెల్లడించకుండానే రద్దు చేశారు. ఇప్పుడు అభ్యర్థులే కొందరు సీట్లు పెంచాకే అడ్మిషన్లు కల్పించాలని కోరడంతో ఇంటర్వ్యూ నిర్వహించలేదు. దీంతో ఆయా రెండు సీట్లలో ఇప్పట్లో ప్రవేశాలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతీ ఆరునెలల కు ఒకసారి ప్రవేశాలకు ఇంటర్వ్యూ నిర్వహించాల్సి ఉంటుంది. ఇక వచ్చే ఏడాది జనవరిలో మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామని, అప్పుడు ఉండే సీట్లసంఖ్యను బట్టి పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తామని ఆర్ట్స్ డీన్ సురేశ్‌లాల్ తెలిపారు.
పీహెచ్‌డీ సీట్లు పెంచాకే నిర్వహించాలి
కేయూ రిజిస్ట్రార్‌కు అభ్యర్థుల వినతి


