మన చేతుల్లోనే నివారణ..
నిత్యం ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరిగి వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనం నడిపేటప్పుడు కుటుంబం గురించి ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజల్లో రోడ్డు ప్రమాదాలపై చైతన్యం రావడం వల్ల చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చు. పోలీసులు ప్రజల ప్రాణాలను కాపాడే విషయంలో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరిస్తూ జరిమానాలు విధించడం, ప్రత్యేక తనిఖీలు పెట్టి అవగాహన కల్పించడం చేస్తుండడంతో కొంత మార్పు కనిపిస్తోంది. ప్రతీ ద్విచక్ర వాహనదారుడు విధిగా హెల్మెట్, కారు నడిపే వ్యక్తి సీటు బెల్ట్ పెట్టుకుంటే ప్రమాదాల సమయంలో ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఎక్కువ.
– వెంకన్న, ట్రాఫిక్ సీఐ, కాజీపేట


