పత్తి బస్తాలు తడవకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

పత్తి బస్తాలు తడవకుండా చూడాలి

Nov 7 2025 6:37 AM | Updated on Nov 7 2025 6:37 AM

పత్తి

పత్తి బస్తాలు తడవకుండా చూడాలి

ఈవీఎం గోదాముల పరిశీలన

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని జిల్లా ఈవీఎం గోదాములను వరంగల్‌ కలెక్టర్‌ తనిఖీ చేశారు. రికార్డులు, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి అధికారులను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట అదనవు కలెక్టర్‌ సంధ్యారాణి, వరంగల్‌ తహసీల్దార్‌ శ్రీకాంత్‌, నాయబ్‌ తహసీల్దార్‌ రంజిత్‌ తదితరులు ఉన్నారు.

వరంగల్‌: వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి బస్తాలు తడవకుండా చర్యలు తీసుకోవాలని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. మార్కెట్‌ను గురువారం కలెక్టర్‌ సందర్శించి పత్తి క్రయవిక్రయాలు, మార్కెట్‌ రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పత్తి ధర, సౌకర్యాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. రైతుల నుంచి ట్రేడర్లు కొనుగోలు చేసిన అనంతరమే ఇటీవల వర్షానికి పత్తి తడిసిందని తెలిపారు. దీంతో రైతులకు ఎలాంటి నష్టం జరగలేదని అన్నారు. వర్షానికి పత్తి తడవకుండా ఉండేందుకు సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. షెడ్లపై నుంచి వర్షపు నీరు కిందికి రాకుండా అడ్డుగా సిమెంట్‌తో కట్టలు నిర్మించాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని, తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదని సీసీఐ అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా, వేగవంతంగా కొనసాగించాలని, రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. వర్షాల కారణంగా తడిసిన పత్తి నాణ్యతను దృష్టిలో ఉంచుకొని రైతుల ప్రయోజనాలను కాపాడేవిధంగా సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్‌ అన్నారు. అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి సురేఖ, వరంగల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి రవీందర్‌రెడ్డి, మార్కెట్‌ గ్రేడ్‌–2 సూపర్‌వైజర్లు రాము, అంజిత్‌రావు, ఏఎస్‌ రాజేందర్‌, రైతులు పాల్గొన్నారు.

పటిష్టమైన కార్యాచరణతో ముంపు నివారణ

పటిష్టమైన కార్యాచరణతో వరంగల్‌లో ముంపు నివారణ చర్యలు చేపడుతున్నామని వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద అన్నారు. చిన్నవడ్డేపల్లి చెరువు పరిసర ప్రాంతాలు, లక్ష్మీగణపతి, మధురానగర్‌కాలనీ, ఎల్బీనగర్‌లోని అంబేడ్కర్‌నగర్‌ను బల్దియా కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌తో కలిసి గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భవిష్యత్‌లో ఇలాంటి ముంపు సమస్యలు పునరావృతం కాకుండా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఇరిగేషన్‌, రెవెన్యూ, మున్సిపల్‌ శాఖ అధికారులను ఆదేశించారు. చిన్నవడ్డేపల్లి చెరువు ఎఫ్‌టీఎల్‌లో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు కోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఎఫ్‌టీఎల్‌లో ఉన్న కట్టడాలను కలెక్టర్‌ పరిశీలించి అనుమతులు ఉన్నాయా, ఉంటే ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు నిర్మించారు అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ, మున్సిపల్‌, ఇరిగేషన్‌ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇలా జరిగిందని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. మట్టి తొలగడంతో పక్కనే ఉన్న లక్ష్మీగణపతి కాలనీ రోడ్డు ప్రమాదకరంగా మారిందని స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చే యగా పరిశీలించారు. వెంటనే పనులు పూర్తి చేయాలని అఽఽధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు సరిగా లేవని శానిటరీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, కా ర్పొరేటర్లు సురేష్‌జోషి, ఓని భాస్కర్‌, ఇన్‌చార్జ్‌ సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజేశ్‌, ఇరిగేషన్‌ ఈఈ కిరణ్‌, బల్దియా ఈఈ సంతోష్‌ బాబు, డీఈ హర్షవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

పత్తి బస్తాలు తడవకుండా చూడాలి 1
1/2

పత్తి బస్తాలు తడవకుండా చూడాలి

పత్తి బస్తాలు తడవకుండా చూడాలి 2
2/2

పత్తి బస్తాలు తడవకుండా చూడాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement