అప్రమత్తతతో లైంగికదాడుల నివారణ
● జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి
క్షమా దేశ్‌పాండే
● ఆన్‌లైన్‌లో బాలికలపై వేధింపులు, బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన
హన్మకొండ: అవగాహన, అప్రమత్తతతో ఆన్‌లైన్ లైంగిక వేధింపులు, బాల్య వివాహాలను నివారించవచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి క్షమా దేశ్‌పాండే అన్నారు. గురువారం సుబేదారిలోని అసుంత భవన్‌లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ, జిల్లా బాలల పరిరక్షణ విఽభాగం, ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో బాలికలపై వేధింపులు, బాల్య వివాహాల నిర్మూలనపై ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల జిల్లాస్థాయి అవగాహన సదస్సు జరిగింది. సదస్సులో క్షమా దేశ్‌పాండే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పాఠశాల, కళాశాల విద్యార్థిని విద్యార్థులకు బాలల హక్కులు, సైబర్ మోసాలపై తప్పకుండా అవగాహన కల్పించాలన్నారు. ఆన్‌లైన్ మోసాలకు గురైతే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. లైంగిక వేధింపులకు గురైన బాలలకు వివిధ ప్రభుత్వ శాఖలు స్నేహపూరిత సేవలు త్వరితగతిన అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ ఆధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జిల్లా సంక్షేమ అధికారి జె.జయంతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అన్నమనేని అనిల్ చందర్‌రావు, సైబర్ క్రైమ్ ఏసీపీ గిరి కుమార్, డీఎంహెచ్‌ఓ అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.


