నేడు వందేమాతరం వేడుకలు
హన్మకొండ: వందేమాతరం గీతం 150 సంవత్సరాల వేడుకలను విజయవంతం చేయాలని బీజేపీ వందేమాతరం కార్యక్రమ రాష్ట్ర కోకన్వీనర్, ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ నాగపురి రాజమౌళి పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ హంటర్ రోడ్‌లోని సత్యం కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ఏడాది పాటు సంబరాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా 150 కేంద్రాల్లో, తెలంగాణలో ఐదు కేంద్రాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో హనుమకొండలో వందేమాతరం గీతం 150 సంవత్సరాల వేడుకలు జరుపనున్నట్లు తెలి పారు. ఈ క్రమంలో శుక్రవారం(నేడు) ఉదయం 10 గంటలకు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలు ధరించి ర్యాలీ నిర్వహించనున్నట్లు వివరించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద వందేమాతరం గీతాన్ని సంపూర్ణంగా అలపించనున్నట్లు చెప్పారు. సమావేశంలో బీజేపీ హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, నిశిధర్ రెడ్డి, నాయకులు డాక్టర్ కాళీ ప్రసాద్, దొంతి దేవేందర్ రెడ్డి, గుజ్జ సత్యనారాయణ, సండ్ర మధు, కె. రాజు, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ వందేమాతరం కార్యక్రమ
రాష్ట్ర కో కన్వీనర్ నాగపురి రాజమౌళి


