కార్తీక పౌర్ణమికి ఏర్పాట్లు
హన్మకొండ కల్చరల్: కార్తీక పౌర్ణమి వేడుకలకు వేయిస్తంభాల దేవాలయంలో ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ జిల్లా ఐదో జోన్ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి పేర్కొన్నారు. ఆలయాన్ని మంగళవారం ఆమె సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆమెను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం ఆమె దేవాలయాన్ని పరిశీలించి మాట్లాడారు. బుధవారం జరిగే కార్తీక పౌర్ణమి వేడుకలకు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆమె వెంట ఆలయ ఈఓ అనిల్‌కుమార్, ఆలయ అర్చకులు, సిబ్బంది ఉన్నారు.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా ఎంఈఓల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎంఈఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా హసన్‌పర్తి ఎంఈఓ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆత్మకూరు ఎంఈఓ విజయ్‌కుమార్ ఎన్నికయ్యారు. సమావేశంలో డీసీఈబీ కార్యదర్శి డాక్టర్ బి.రాంధన్, ఎంఈఓలు పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం, ఇండియన్ పోస్టు పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ) మంగళవారం ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఈ ఎంఓయూతో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తారు. ఉద్యోగ అవకాశాలు, వృత్తినైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు దోహదం చేస్తుంది. కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గుర్రం శ్రీనివాస్, కామర్స్ విభాగం అధిపతి డి. రాజశేఖర్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఎ.అనిల్‌కుమార్, ఐపీపీబీ సీనియర్ మేనేజర్ ప్రమోద్, మేనేజర్ ప్రవీణ్, అధ్యాపకులు జె.చిన్నా, యాకూబ్, శివనాగశ్రీను, ఉమాదేవి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: విద్యాభివృద్ధికి ఎంఈఓలు కృషిచేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్, డీఈఓ ఎ.వెంకటరెడ్డి కోరారు. జిల్లాలోని ఎంఈఓలు మంగళవారం వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. త్వరలో ఎంఈఓలు, హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించి విద్యాభివృద్ధిపై చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి డాక్టర్ బి.రాంధన్, ఎంఈఓల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ. శ్రీనివాస్, ఎంఈఓలు బి.మనోజ్‌కుమార్, గుగులోత్ నెహ్రూ, కె.హనుమంతరావు, ఎల్.రాజ్‌కుమార్, ఎన్. భిక్షపతి, కె.శ్రీధర్, డీసీఈబీ సహాయ కార్యదర్శి జి.ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కార్తీక పౌర్ణమికి ఏర్పాట్లు
కార్తీక పౌర్ణమికి ఏర్పాట్లు


