కలెక్టరేట్ బిజీబిజీ..
హన్మకొండ అర్బన్: హనుమకొండలోని కలెక్టరేట్ ఐడీఓసీ భవనం మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు బిజీబిజీగా కనిపించింది. ఒకవైపు ఎన్నికల సంఘం ఆదేశాలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ రద్దీగా ఉంది. అదే సమయంలో ఇతర రెవెన్యూ కార్యాలయాల్లో ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చుతూ వివిధ మండలాల నుంచి వచ్చిన రెవెన్యూ సిబ్బంది గణాంకాలు చేపట్టారు. ఇక సాయంత్రానికి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. కలెక్టర్‌తో కలిసి తుపాను ప్రభావం, నష్టపరిహారం అంచనాలపై అధికారులతో సమీక్షించారు. మొత్తానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టరేట్ ప్రాంగణంలో కిక్కిరిసిన వాతావరణం నెలకొంది.


