30లోపు కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలి
హన్మకొండ అర్బన్ : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులు ఈ నెల 30 నాటికి చెలల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అదేవిధంగా పనుల ప్రాధాన్యత క్రమం గుర్తించాలని కోరుతూ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వరంగల్ సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ స్నేహ శబరీష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్‌తో వారు మాట్లాడుతూ జిల్లాలోని అనేకమంది కాంట్రాక్టర్లు కొన్నేళ్లుగా పూర్తయిన ప నులకు చెల్లింపులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నవంబర్ 30 లోపు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, ప్రస్తుత పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు పనులు కొనసాగించడం అసాధ్యమవుతుందని స్పష్టం చేశారు. వినతిపత్రం ఇచ్చిన వా రిలో పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, వీరారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఐలయ్య తదితరులు ఉన్నారు.


