నిండు ప్రాణం
క్షణం ఆలస్యం విలువ..
అంబులెన్స్‌కు దారి ఇవ్వడం సామాజిక బాధ్యత
కాజీపేట: అంబులెన్స్ ప్రాణదాత. రహదారులపై ప్రమాదం, అత్యవసర పరిస్థితి, పురిటి నొప్పులు, గుండెపోటు.. ఇలా కారణం ఏదైనా ఫోన్ చేయగానే వెంటనే వచ్చి బాధితుడిని తక్షణం ఆస్పత్రికి తీసుకువెళ్లే సంజీవని. ఈ క్రమంలో అంబులెన్స్ కూత (సైరన్) ఎక్కడ వినిపించినా తక్షణం వాహనాన్ని ప క్కకు మళ్లించి దారివ్వడం పౌరుడి విధి. అంబులె న్స్‌కు ట్రాఫిక్ నిబంధనలు కూడా వర్తించవు. అంటే ఆ వాహన ప్రయాణం నిరంతరంగా సాగా ల్సిన అవసరం ఉంటుంది. అయితే అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఇటీవల ఎక్కువయ్యాయి. అత్యవసర సమయంలో వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేస్తాం. అదే సమయంలో మన వెనుక వచ్చే ఆ వాహనానికి దారి ఇవ్వడం మరచిపోతాం. ముఖ్యంగా ప్రధాన కూడళ్లు, సిగ్నల్ పాయింట్ల వద్ద దారి ఇవ్వకుండా వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంబులెన్స్‌ను కూ డా సాధారణ వాహనంగానే ఎక్కువ మంది భావి స్తున్నారు. కొందరు సామాజిక బాధ్యతగా దారి ఇవ్వాలని చెప్పినా ఎగతాళి చేసేవారు కూడా ఎందరో. ఈ పరిస్థితిపై పలువురు సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తప్పనిసరిగా దారి ఇవ్వాలి..
అంబులెన్స్‌కు దారి ఇవ్వడం సామాజిక బాధ్యత. ఈ విషయంలో చాలామందికి అవగాహన లేక బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. నగరంలోని జాతీయ రహదారిని ఆనుకుని చాలా ప్రాంతంలో సర్వీస్ రోడ్లు ఉన్నాయి. ఆ సర్వీస్ రోడ్లపైనే తమ వాహనాలు నడపాల్సిన ఆటో డ్రైవర్లు యథేచ్ఛగా హైవేపై హల్‌చల్ చేస్తున్నారు. సిగ్నల్ పాయింట్ల వద్ద వీరి అడ్డంకులే ఎక్కువ. అలాగే చాలా మంది ద్విచక్రవాహనదారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంబులెన్స్‌లు సర్వీస్ రోడ్లపై వెళ్లాలంటే ఎక్కడిక్కడ ఉండే స్పీడ్ బ్రేకర్లతో ఇబ్బందులు. అందుకే ఆటో డ్రైవర్లు కచ్చితంగా సర్వీస్ రోడ్లపై తిరిగేలా చూస్తే అంబులెన్స్‌లకు మార్గం కొంత సులవవుతుంది. అదే సమయంలో అంబులెన్స్‌లు ఫ్రీగా వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు.
ప్రయాణ సమయంలో మనం ఏదో సందర్భంలో అంబులెన్స్ కూత (సైర న్) వింటూనే ఉంటాం. ఇందులో ప్రాణంతో పోరాడుతున్న వ్యక్తి అయి ఉండొచ్చు. లేదా ప్రసవ వేదన అనుభవిస్తున్న గర్భిణి కావొచ్చు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడు అయి ఉండొచ్చు. అందుకే సైరన్ వినపించగానే వీలైనంత వరకు వాహనానికి దారి ఇచ్చి ముందుకు వెళ్లేలా చూడడం ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యత. మన నిర్లక్ష్యం వల్ల క్షణం ఆలస్యం కావొచ్చు. దీని విలువ ఓ నిండు ప్రాణం. ఈ విషయంలో మనం చైతన్యవంతులు కావడం ముఖ్యం.
ఎంత రద్దీ ఉన్నా వెంటనే తప్పుకోవాలి..
ముందుకు పంపాలి
వాహనంలో ప్రాణాలతో పోరాడుతున్న వారు
ఉండొచ్చు
అంబులెన్స్‌కు దారి
ఇవ్వకపోవడం కూడా నేరమే..
దీనిపై అవగాహన
కల్పించాలంటున్న ప్రజలు


