ప్రజాస్వామ్య బీసీ ఉద్యమ వేదిక ఆవిర్భావం
హసన్‌పర్తి : ప్రజాస్వామ్య బీసీ ఉద్యమ వేదిక మండలంలోని భీమారంలో జరిగిన కార్యక్రమంలో ఆవిర్భవించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆ వేదిక రాష్ట్ర కన్వీనర్ గాలీబు అమరేందర్ మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం బీసీలకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం జరిగే పోరాటంలో విద్యావంతులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు, యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత దేశంలో జరుగుతున్న డొల్ల బీసీ ఉద్యమాలను గాడిలో పెట్టడమే కాకుండా బీసీ రిజర్వేషన్ సాధనకు పార్లమెంట్‌లో చట్టం చేసే వరకు త్యాగపూరిత పోరాటాలు చేయాలన్నారు. సమావేశంలో ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, వైస్ చైర్మన్లు పటేల్ వనజ, వనిత, హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వర్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, కన్వీనర్ సోమ రామమ్మూర్తి, బీసీ రైటర్స్‌వింగ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చింత ప్రవీణ్‌కుమార్, బీసీ యూనైటెడ్ ఫ్రంట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసు, డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కమిటీ ఎన్నిక
ప్రజాస్వామ్య బీసీ ఉద్యమ వేదిక కమిటీని సోమవారం ప్రకటించారు. రాష్ట్ర కన్వీనర్‌గా గాలీబు అ మరేందర్, కో–కన్వీనర్లుగా సదానందం(హుజురాబాద్), వేముల రమేశ్ (సిరిసిల్ల), సకినాల అమర్(వేములవాడ), వెలుగు వనిత(సూర్యాపేట), వాసు కె.యాదవ్( హైదరాబాద్), కర్ణాటక సమ్మయ్య(భూపాలపల్లి)లను ఎన్నుఎకున్నారు.


