
నా నిశ్శబ్దమే సమాధానం
జనగామ: పొన్నాల నార్టీ మారుతాడని ప్రచారం చేస్తున్న కొంతమంది మూర్ఖులకు తన నిశ్శబ్దమే చెంపదెప్ప లాంటిదని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ నేత పొన్నాల లక్ష్యయ్య ఘాటుగా విమర్శించారు. రాజకీయాల్లో తాను ఎప్పుడూ టైగరేనని, అవసరమైనప్పుడే గర్జిస్తానని, ప్రజల పక్షాన నిలబడతానని చెప్పుకొచ్చారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తున్న కేసీఆర్‌తో కలిసి ముందుకెళ్లేందుకే బీఆర్‌ఎస్‌లోకి వచ్చానన్నారు. దేశచరిత్రలో ఎక్కడా లేని విధంగా అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ప్రజాదరణ కోల్పోయిన పార్టీగా కాంగ్రెస్ చరిత్ర పుటల్లో నిలుస్తుందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ఓటమి తాత్కాలికమేనని, కోట్లాది మంది ప్రజల అభిమానం ఉన్న కేసీఆర్‌కు అంతకు రెట్టింపు ఆదరణ రానుందన్నారు. లక్షలకు పైగా మైనారిటీ ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్‌లో గెలవలేని కాంగ్రెస్, ఉపఎన్నికల్లో విజయం తమదే అనడం సిగ్గుచేటన్నారు. నూటికి నూరు శాతం అక్కడ బీఆర్‌ఎస్ మరోసారి జెండా ఎగురవేయబోతోందన్నారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గాడిపల్లి ప్రేమలతారెడ్డి, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం, మాజీ ఎంపీపీ బైరగోని యాదగిరి గౌడ్, సీనియర్ నాయకులు పసుల ఏబేలు, ధర్మపురి శ్రీనివాస్, ఎండీ మాజిద్, ఉల్లెంగుల సందీప్, కొమ్ము రాజు, ఎండీ యాకూబ్, ఉడుగుల కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.
పార్టీ మారుతానని ప్రచారం చేసేవాళ్లకు అదే చెంపదెబ్బ
అత్యంత తొందరగా ప్రజాదరణ
కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య