
ఏటీఎం కార్డు తస్కరించి రూ.19వేలు డ్రా
కాజీపేట: ఆదరిస్తున్న కుటుంబాన్నే ఓ యువకుడు వంచించాడు. ఏటీఎం కార్డు తస్కరించి రూ.19వేలు డ్రా చేశాడు. బాధితుల కథనం ప్రకారం.. కాజీపేటకు చెందిన బైరి సునీత కుటుంబ సభ్యులు తమకు పరిచయం ఉండి ఉపాధిలేక తిరుగుతున్న కడిపికొండకు చెందిన యువకుడు శివను చేరదీసి చేయూతనందిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం స్కూటీ డిక్కీలో ఉన్న ఏటీఎం కార్డును తస్కరించి రూ.19వేలు డ్రాచేశాడు. బాధితుల సెల్‌కు డబ్బులు డ్రా అయ్యినట్లు మెస్సేజ్ రావడంతో ఖంగుతిన్నారు. బైక్ డిక్కీలో చూడగా ఏటీఎం కార్డు కనిపించకపోవడంతో శివ డ్రా చేసి ఉంటాడని భా వించారు. అనంతరం ఫోన్ చేయగా తనను దుండగులు కిడ్నాప్ చేశారంటూ పొంతనలేని సమాధానా లు చెప్పాడు. దీంతో సునీత కుటుంబీకులు బ్యాంకులో ఫిర్యాదు చేసి ఖాతా లావాదేవీలను నిలిపివేయించారు. కాగా, శివపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు సునీత విలేకరులకు తెలిపారు.
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలోని పలు జూ నియర్ కళాశాలల్లో సమాచార హక్కు చట్టం, సుపరిపాలన అంశంపై విద్యార్థులకు గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగశాయిపేట, కృష్ణాకాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పోటీలను జిల్లా ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ పరిశీలించి మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రిన్సిపాళ్లు సంపత్‌కుమార్, శరదృతి, అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.