వరంగల్: కుటుంబ గొడవలను మనసులో పెట్టుకుని తనపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన కోడలు పెరుమాండ్ల విద్యారాణి, ఆమె తల్లి పోరండ్ల నిర్మల, తమ్ముళ్లు వేణు, తరుణ్‌పై చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని వరంగల్ ఎల్‌బీనగర్‌కు చెందిన వృద్ధురాలు పెరుమాండ్ల అరుంధతి(70) పోలీసులను కోరారు. ఈ మేరకు గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన పెద్ద కుమారుడు నరేశ్, విద్యారాణికి 14ఏళ్ల క్రితం పెళ్లి అయ్యిందని, హైదరాబాద్‌లో ఉంటున్న వీరి మధ్య ఏడాది క్రితం గొడవలు జరగడంతో ఆమె తన తల్లి గారింటికి వెళ్లిందన్నారు. మనస్పర్థలు రావడంతో ఇద్దరు వేరుగా ఉంటున్నారన్నారు. ఈ క్రమంలో ఈనెల 6న తాను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తన కోడలు, ఆమె తల్లి, తమ్ముళ్లు దాడికి పాల్పడ్డగా తీవ్రంగా గాయపడ్డానన్నారు. అనంతరం తన సెల్‌ఫోన్, లాప్‌టాప్, భూపత్రాలను తమ వెంట తీసుకెళ్లారన్నారు. ఈదాడిపై తాను ఇంతేజార్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారని, దీనిపై పోలీసు అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
పోలీసు అధికారులకు వృద్ధురాలి విజ్ఞప్తి