
అయినా తగ్గేదేలే..
కాజీపేట అర్బన్: మందుబాబులకు మద్యం కిక్కు, ప్రభుత్వ ఖజానాకు ఎకై ్సజ్ శాఖ వైన్స్ షాపుల టెండర్లతో కిక్కు అన్న చందంగా ఉంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్న లిక్కర్ సేల్స్‌తో ఎకై ్సజ్ శాఖ తన మార్క్‌ను నిలబెట్టుకుంటుంది. దీంతో మద్యం వ్యాపారాన్ని ఎంచుకున్న వారికి ఓన్లీ బెనిఫిట్స్ తప్ప లాస్ లేని బిజినెస్‌గా మద్యం వ్యాపారం అంటూ ఏటా మద్యం వ్యాపారాన్ని తమ బిజినెస్‌గా ఎంచుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టెక్స్‌టైల్స్‌తో పాటు పొలిటీషియన్లు సైతం లిక్కర్ బిజినెస్‌లోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
పెరిగిన ఫీజు..
ఎకై ్సజ్ టెండర్ల ప్రకటనను ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా? అంటూ వేచి ఉండేవారు తమ లక్కు కిక్కును పరీక్షించుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దీంతో రెండేళ్ల కాల పరిమితితో వచ్చే వైన్స్ టెండర్లలో దరఖాస్తుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం దరఖాస్తుల ఫీజును సైతం పెంచుకుంటూ పోతూ దరఖాస్తుల ఫీజు తగ్గేదేలే ఆదాయం తగ్గేదేలే అంటూ రేట్లు పెంచేస్తున్నారు. కాగా.. 2019–21 వరకు రూ.1 లక్ష ఉన్న దరఖాస్తు ఫీజును 2021–23, 2023–25 వరకు దరఖాస్తు ఫీజును రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలు పెంచారు. కాగా తాజాగా 2025–27 రెండేళ్ల కాలపరిమితితో వైన్స్ టెండర్లకు దరఖాస్తు ఫీజును రూ.3 లక్షలుగా ఖరారు చేశారు.
నాన్ రీఫండ్ అయినా..
‘వైన్స్ దరఖాస్తుల ఫీజు నాన్ రీఫండ్ అయినా ఫర్వాలేదు టెండర్లలో పాల్గొంటాం’ అంటూ మద్యం వ్యాపారులు దూసుకొస్తున్నారు. రియల్, టెక్స్‌టైల్, పొలిటీషియన్లతో పాటు సిండికేట్ రాయుళ్లు వంద సంఖ్యలో దరఖాస్తులను వేస్తూ ఖజానాకు ఆదాయాన్ని దండిగా ఇస్తున్నారు. కాగా, వరంగల్ అర్బన్ (హనుమకొండ) జిల్లాలోని గతంలో 65 వైన్స్‌గాను 2023–25కు 5,859 దరఖాస్తులకుగాను రూ.117 కోట్లు ఆదాయం రాగా, ఈసారి 2025–27కు దరఖాస్తులు డబుల్ అయ్యి 250 కోట్ల ఆదాయం టార్గెట్‌గా వస్తుందని అంచనా.
వైన్స్ దరఖాస్తుల ఫీజు
రూ. లక్ష నుంచి రూ.3 లక్షలకు
ఎకై ్సజ్ శాఖ టెండర్లతో ఖజానా గలగల
వివరాలు ఇలా..
సంవత్సరం దరఖాస్తులు ఆదాయం
2021–23 2,983 రూ.59 కోట్లు
2023–25 5,859 రూ.117 కోట్లు