
గ్రేటర్ వరంగల్
(హనుమకొండ – వరంగల్)
మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
ఉర్సు రంగలీల మైదానంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు
పద్మాక్షి గుండం వద్ద బతుకమ్మలతో మహిళల కోలాహలం
7
వరంగల్ ఆకారపు విశ్వేశ్వర దేవాలయంలో..
ఉర్సు రంగలీల మైదానానికి బతుకమ్మలతో వస్తున్న ఆడపడుచులు
వేయిస్తంభాల దేవాలయంలో..
12 ఫీట్ల బతుకమ్మ చుట్టూ ఆడిపాడుతున్న గాంధీనగర్ మహిళలు
పద్మాక్షి గుండం వద్ద బతుకమ్మ ఆడుతూ..
సంబురంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
ముద్దబంతులు మురిసిపోయాయి. చామంతులు చెమక్కున మెరిశాయి. తంగేడు వనాలు బంగారు వర్ణాలయ్యాయి. అల్లిపూలు అందంగా విరిశాయి. కట్లపూలు, కనకాంబరాలు కనువిందు చేశాయి. సీతజడలు సిగ్గుపడ్డాయి. స్వస్తికాలు సంబురపడగా.. గుమ్మడి పూలు గౌరమ్మగా మారాయి. గునుగు గుభాలించగా.. మహిళల చేతుల్లో పూల శిఖరాలు పురుడుపోసుకున్నాయి. వారంతా చల్లని తల్లిని పాటలతో స్మరిస్తూ.. చప్పట్లతో గొప్పదనాన్ని వర్ణిస్తూ బతుకునివ్వమని వేడుకున్నారు. గౌరమ్మకు పూజలు చేసి ఘనంగా వీడ్కోలు పలికారు. సోమవారం గ్రేటర్ వరంగల్ నగరంలో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఖిలా వరంగల్, ఉర్సు గుట్ట రంగలీల మైదానం, పద్మాక్షి దేవాలయ పరిసరాల్లో సద్దుల వేడుకలు వైభవంగా నిర్వహించారు. తీరొక్కపూలతో బతుకమ్మలు పేర్చి ఆడపడుచులు ఆడిపాడి సందడి చేశారు. – హన్మకొండ కల్చరల్

గ్రేటర్ వరంగల్

గ్రేటర్ వరంగల్

గ్రేటర్ వరంగల్

గ్రేటర్ వరంగల్

గ్రేటర్ వరంగల్