
ఆహారం.. ఆరోగ్యం
ఆకుకూరలు తప్పనిసరి
ఖిలా వరంగల్ : ఆధునిక జీవన శైలిలో ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సహజ సిద్ధంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పాలు, గుడ్లు తదితర ఆహార పదార్థాలను తగ్గించి పాశ్చాత్య ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటున్నారు. ఫలితంగా కడుపు నిండుతున్నా శరీరానికి మాత్రం నష్టం జరిగి యుక్త వయసులోనే వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉంటోంది. ఇందుకు కారణం తీసుకునే ఆహారమేనని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కుటుంబీకులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇంట్లో ఆనందం వెళ్లివిరుస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుత రోజుల్లో మానవుడు ఆరోగ్యంగా ఉండానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..
సంప్రదాయ వంటలతోనే
ఆరోగ్యం పదిలం
పాశ్చాత్య అలవాట్లతో శరీరానికి నష్టం
ఆకుకూరలు అన్నింటికీ ప్రయోజనం
సేంద్రియ పంటలైతే మరీ మంచిది
రోజు వారీ తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా సహజ సిద్ధమైన ఆకుకూరలు, కూరగాయలతోపాటు పప్పుదినుసులు ఉండేలా తీసుకోవాలి. సజ్జలు, రాగులు, జొన్నలు, తోటకూర ఎక్కువ తీసుకోకపోవడం వల్ల గర్భిణులు, బాలింతలు అధిక శాతం మందులు వాడాల్సి వస్తుంది. గుడ్డు, పాలు రోజూ పరిమితంగా తీసుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీరు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
– అచ్చ వరుణ్, జనరల్ సర్జన్, వరంగల్