
ఎన్నికలపై సందేహాల నివృత్తి
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహశబరీష్, సత్యశారద అన్నారు. మంగళవారం ఆయా కలెక్టరేట్లలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి నవంబర్ 11 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. హనుమకొండ జిల్లా నుంచి అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ నారాయణ, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, జెడ్పీ సీఈఓ రవి, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవి శ్రీనివాస్‌రావు, కొలను సంతోశ్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్యాంసుందర్, ప్రవీణ్‌కుమార్, నాగవెల్లి రజనీకాంత్ పాల్గొన్నారు. వరంగల్ నుంచి అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, అధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
దసరా ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన
ఖిలా వరంగల్: రంగలీల మైదానంలో అక్టోబర్ 2న జరిగే దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులకు ఆదేశించారు. ఏర్పాట్లను మంగళవారం బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, డీసీపీ సలీమా, ఏఎస్పీ శుభం, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఎన్నికలపై సందేహాల నివృత్తి