
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారానికి కృషి
వరంగల్ లీగల్ : మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి న్యాయవాదులు, కక్షిదారులు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి జిల్లా అడ్మినిస్ట్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా కోర్టులోని 10 కోర్టుల భవనంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. న్యాయమూర్తులు పాత సివిల్ కేసులపై దృష్టి సారించాలని, వాటి పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ బిల్డింగ్ ముందు మధ్యవర్తిత్వం ద్వారా జరిగే లాభాలు అనే బ్యానర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌లు వీబీ నిర్మలా గీతాంబ, పట్టాభిరామారావు, కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్‌పాండే, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ మెంబర్లు, ఉమ్మడి బార్ అసోసియేషన్ అధ్యక్షులు, న్యాయవాదులు వివిధ బ్యాంకుల అధికారులు, ఇన్సూరెన్స్ అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు.
● హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్
● డీసీసీబీ భవన్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు
జాతీయ లోక్ అదాలత్ ప్రారంభంలో
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్

మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారానికి కృషి