
జాతీయ లోక్ అదాలత్‌కు అపూర్వ స్పందన
వరంగల్ లీగల్: వరంగల్, హనుమకొండ జిల్లాల కోర్టు ప్రాంగణాల్లో శనివారం వేర్వేరుగా ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్‌కు అపూర్వ స్పందన లభించింది. కేసుల పరిష్కారానికి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 బెంచ్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో వరంగల్ – 8, నర్సంపేట–2 బెంచ్‌లు ఏర్పాటు చేసి 5,938 పెండింగ్ కేసులు ఛేదించారు. ఇందులో సివిల్ 26, ఎంవీఓపీ 24 కేసులకు రూ.2,15, 44,176లు, క్రిమినల్ కేసులు 5912, బ్యాంకు పీఎల్‌సీ కేసులు 76,720 కేసులకు రూ. 2,28,82,709లతో పరిష్కరించారు. అలాగే, హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 8 బెంచ్‌లు ఏర్పాటు చేసి 56,867 పెండింగ్ కేసులు పరిష్కరించారు. ఇందులో సివిల్ కేసులు 71, ఎంవీఓపీ 62 కేసులకు రూ.7,31,55,963లు, క్రిమినల్ కేసులు 18,412, బ్యాంకు పీఎల్‌సీ 38,379 కేసులకు రూ.1,15,56,828లతో పరిష్కరించారు. ఈజాతీయ లోక్ అదాలత్‌లో వినూత్న లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డేవిడ్ రాజ్‌కుమార్ సుమారు 300 పులిహోర ప్యాకెట్లను కక్షిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు, కక్షిదారులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు జయశ్రీ, రమాదేవి పాల్గొన్నారు
దంపతులను కలిపిన లోక్ అదాలత్..
మహబూబాబాద్ రూరల్ : కుటుంబ తగాదాలతో కొంతకాలంగా దూరంగా ఉంటున్న దంపతులను లోక్ అదాలత్ కలిపింది. మహబూబాబాద్ జిల్లా గంగారం పోలీసు స్టేషన్ పరిధికి చెందిన బోడ అనూష, అనిల్ దంపతులు ఏడాది నుంచి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో డీఎస్పీ తిరుపతిరావు ఆధ్వర్యంలో గూడూరు సీఐ సూర్యప్రకాశ్, గంగారం ఎస్సై రవికుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఫిర్యాది అనూషతో మాట్లాడి రాజీ కుదుర్చగా
శనివారం లోక్ అదాలత్ సందర్భంగా కోర్టు డ్యూటీ అధికారి వెంకటేశ్వర్లు ఆ దంపతులను జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ సమక్షంలో మాట్లాడించారు. దీంతో తాము కలిసి ఉంటామని ఒప్పుకున్నారు. కాగా, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ వారిని అభినందించారు.
యూరియా వచ్చేసింది..
ఖిలా వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్ గూడ్స్ షెడ్‌కు శనివారం 2,644.150 సీఐఎల్ కోరమండల్ యూరియా వచ్చింది. దీంతో రైతులకు ఊరట లభించనుంది. వ్యవసాయ అఽధికారులు విజ్ఞాన్, రవీందర్‌రెడ్డి.. కంపెనీ ప్రతినిధులతో కలిసి యూరియా స్టాక్‌ను పరిశీలించారు. కలెక్టర్ సత్యశారద, డీఏఓ అనురాధ.. మార్క్‌ఫెడ్‌కు 60 శాతం, ప్రైవేట్‌ఫర్టిలైజర్ డీలర్లకు 40శాతం కేటాయించారు. వరంగల్ జిల్లాకు 424.15 మెట్రిక్ టన్నులు, హనుమకొండ 430, ములుగు 300, జయశంకర్ భూపాలపల్లి 400, జనగామ 450, మహబూబాబాద్ జిల్లాకు 440 మెట్రిక్ టన్నుల కేటాయింపులు జరిగాయి. శనివారం సాయంత్రం వరకు యూరియాను జిల్లా, మండల కేంద్రాలకు తరలించే కార్యక్రమాన్ని చేపట్టామని ఏఓ రవీందర్ రెడ్డి తెలిపారు.

జాతీయ లోక్ అదాలత్‌కు అపూర్వ స్పందన