
న్యాయవాదులకు శిక్షణ తరగతులు అవసరమే
● హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్
వరంగల్ లీగల్ : యువ న్యాయవాదులకు శిక్షణ త రగతులు అవసరమేనని తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్‌గౌడ్ అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని డీసీసీబీ భవన్‌లో తెలంగా ణ రాష్ట్ర న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా జడ్జి లక్ష్మణ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సీనియర్ న్యాయవాది కె.వి. గుప్తా రాసిన ‘తెలంగాణ కోర్టు ఫీ యాక్ట్ పుస్తకం’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్‌గౌడ్ మాట్లాడారు. యాంటీ కరప్షన్ లాస్, ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ అంశాల్లో యువ న్యా యవాదులు మెళకువలు తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయవాద పరిషత్ అ ధ్యక్ష, కార్యదర్శులు ఎల్.ప్రభాకర్ రెడ్డి, శ్యాంశాని సునీల్, చొళ్లేటి రామకృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు
అమ్మవారికి హైకోర్టు జడ్జి పూజలు..
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయాన్ని శనివారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కె. లక్ష్మణ్ సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్తలు.. జస్టిస్‌ను ఘనంగా స్వాగతించారు. పూజలనంతరం అర్చకులు శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తి పట్టాభి రామారావు, వరంగల్ జిల్లా న్యాయమూర్తి నిర్మలా గీతాంబ తదితరులు పాల్గొన్నారు.