
ఓటమిని గెలుపుగా మలుచుకోవాలి
కొత్తగూడ: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరాశపడకుండా గెలుపు కోసం మరోసారి ప్రయత్నించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి ఈఎంఆర్‌ఎస్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడల ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశ నుంచి క్రీడలు, చదువులో ప్రతిభచాటాలన్నారు. ప్రస్తుత క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఒడిశాలో జరిగే జాతీయ స్థాయి క్రీడల్లో పథకాలు సాధించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచి నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. అనంతరం ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించిన కామారెడ్డి జిల్లా గంధారి ఈఎంఆర్‌ఎస్‌కు, అలాగే వివిధ విభాగాల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్, ఆర్డీఓ కృష్ణవేణి, స్పోర్ట్స్ ఆఫీసర్ వీర్యనాయక్, ఆర్సీఓ రత్నకుమారి, రాష్ట్ర ఉపాధిహామీ సంస్థ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ అజ య్‌సింగ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎస్పీతో మంత్రిప్రత్యేక సమావేశం..
ఈఎంఆర్‌ఎస్‌లో క్రీడల ముగింపు కార్యక్రమానికి వచ్చిన మంత్రి సీతక్క.. ఎస్పీ సుధీర్‌రాంనాఽథ్ కేకన్‌తో పాఠశాలలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎవరిని లోపలికి అనుమతించకపోవడం గమనార్హం. జిల్లాలో యూరియా పంపిణీ గురించి ఎస్పీని అడిగి తెలుసుకున్నట్లు సమాచా రం. కొత్తగూడ, గంగారం మండలాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎస్పీకి సూచించినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ముగిసిన రాష్ట్ర స్థాయి క్రీడలు