గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Oct 7 2026 2:16 AM | Updated on Oct 7 2026 2:16 AM

బుధవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 నిమ్మకాయల ధరలు

న్యూస్‌రీల్‌

సీనియర్‌లను పట్టించుకోని చినబాబు వర్గం మంత్రులు, ఎంపీల అండతో ఎమ్మెల్యేలపై నాయకుల తిరుగుబాటు స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆందోళనలో శ్రేణులు

బాపట్ల జిల్లాలో...

బుధవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

తెనాలి: స్థానిక మార్కెట్‌ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.6 వేలు, గరిష్ఠ ధర రూ.8,900, మోడల్‌ ధర రూ.7,400 వరకు పలికింది.

టీడీపీలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికే గ్రూపులుగా తమ్ముళ్లు గొడవలకు దిగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు పార్టీ కోసం కష్టపడ్డ ఏ ఒక్కరికీ పదవులు దక్కడం లేదని, పైరవీలు చేసే వారికే ఇస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. సీనియర్‌ ఎమ్మెల్యేలకు తెలియకుండానే జిల్లాలో పదవుల పందేరం సాగుతోంది. దీంతో వారు లోలోపల రగిలిపోతున్నారు.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: కొందరు సీనియర్‌లను చినబాబు వర్గంగా ఉన్న జూనియర్‌ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి పదవుల వరకు సీనియర్‌ ఎమ్మెల్యేల మాటకు విలువ లేకుండా పోతోంది. సొంత నియోజకవర్గాల్లోనే వారికి తెలియకుండా పదవులు ఇవ్వడంపై భగ్గుమంటున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్ష పదవులు సైతం సీనియర్‌ల అభిప్రాయాలు తీసుకోకుండా భర్తీ చేశారని ఆగ్రహిస్తున్నారు. మండల స్థాయి నేతలను తమపై పెత్తనం చేసేందుకు పెడుతున్నారనే అభిప్రాయం వారి నుంచి వ్యక్తమవుతోంది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్‌ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్‌కుమార్‌, ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ల మాటను అధిష్ఠానం పెడనచెవిన పెడుతోందనే భావన వారిలో ఉంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీలోకి కొత్తగా వచ్చిన జూనియర్లు, చినబాబు వర్గంగా కొనసాగుతున్న ద్వితీయ శ్రేణి నేతల మాటలే చెల్లుబాటు అవుతుండటంపై సీనియర్‌ ఎమ్మెల్యేలు లోలోపల రగిలిపోతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో బయటపడకుండా నాలుగు డబ్బులు సంపాదించుకుని ప్రశాంతంగా ఉందామనే భావనతో నియోజకవర్గాల్లో సైతం పెద్దగా కనిపించకుండా తిరుగుతున్నారు. ముఖ్యంగా నరసరావుపేట, గుంటూరు ఎంపీల పెత్తనం నియోజకవర్గాల్లో ఎక్కువ అవడం వల్ల సీనియర్‌లకు ఇది మింగుడు పడడం లేదు. ఇటీవల ఇచ్చిన పదవుల్లోనూ ఎమ్మెల్యేలకంటే ఎంపీల అనుచరులకే ఎక్కువ పదవులు దక్కడంపై సైతం ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల మధ్య అసమ్మతి భగ్గుమనడం ఆ పార్టీ కార్యకర్తలకు నిద్ర పట్టనీయడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక పోరులో ఓటమి తప్పదనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.

గుంటూరు జిల్లాలో ఇలా...

గుంటూరు జిల్లాలో చినబాబు, కేంద్ర మంత్రి వర్గీయులు తమపై పెత్తనం చేస్తుండటం సహించలేక ఎమ్మెల్యేలు తీవ్రంగా మదనపడుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాలు అయిన ప్రత్తిపాడు, తాడికొండ నియోజకవర్గాల్లో అధికార పార్టీ సామాజిక వర్గం నేతలు చినబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని పేరు చెప్పి ఎమ్మెల్యేలపై పెత్తనం చేస్తుండటంపై ఎమ్మెల్యే వర్గీయులు మండిపడుతున్నారు. రాజధాని ప్రాంతంలో అక్కడి ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ మాట వినే అధికారులే కరువయ్యారు. కేంద్ర మంత్రి పెమ్మసానితోపాటు మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ పెత్తనం ఎక్కువైంది. ఎమ్మెల్యేకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదనే విమర్శలు ఆయన వర్గీయుల నుంచి వినిపిస్తున్నాయి. గుంటూరు నగరంలో సైతం ఎమ్మెల్యేలను డమ్మీలుగా మార్చి పెమ్మసాని, ఆయన వర్గీయులే పెత్తనం చెలాయిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. అధికారులు సైతం ఎమ్మెల్యేల మాటలు లెక్కచేయడం లేదనే విషయాన్ని పలుమార్లు వారే బహిరంగంగా చెప్పడం గమనార్హం. జిల్లా స్థాయి పదవులు సైతం ఎమ్మెల్యేలు తమ వర్గీయులకు ఇప్పించుకోలేని దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా తమ మాట పరిగణనలోకి తీసుకోవాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. సీనియర్‌ ఎమ్మెల్యేగా ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర సైతం సంగం డెయిరీ కార్యకలాపాలు తప్ప, జిల్లా రాజకీయాల్లో పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకు కారణం చినబాబు, పెమ్మసాని మితిమీరిన పెత్తనమేనని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

కాంట్రాక్టు వైద్య సిబ్బంది విధుల బహిష్కరణ

పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతల బాహాబాహీ

కొత్తగా జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఎవరికి వారే యమునా తీరే అనే చందంగా టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి తయారైంది. మంత్రిగా ఉన్న రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు సైతం సొంత నియోజకవర్గంలో ఇబ్బందులు తప్పని పరిస్థితి. చీరాల నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే అయిన కొండయ్యకు అసమ్మతి సెగ అధికమైంది. పర్చూరు నియోజకవర్గంలో సీనియర్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఏలూరి సాంబశివరావుకు చంద్రబాబు తోడల్లుడి రూపంలో నియోజకవర్గంలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా దహించి వేస్తుంది. రానున్న ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి కుమారుడికి పర్చూరు టిక్కెట్టు దక్కుతుందంటూ ఆయన వర్గీయులు బహిరంగంగా చెబుతుండటంతో ప్రస్తుత ఎమ్మెల్యే వర్గం రగిలిపోతుంది. వేమూరులో సైతం నక్కా ఆనందబాబుకు మండల స్థాయిలో అసమ్మతి నిద్రపట్టకుండా చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement