గంజాయి కేసులో నలుగురు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి కేసులో నలుగురు అరెస్ట్‌

Jul 28 2026 2:00 AM | Updated on Jul 28 2026 2:00 AM

బాపట్ల టౌన్‌: బాపట్ల మండలం వెదుళ్ళపల్లి గ్రామంలో గంజాయి తాగుతున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్‌ చేశారు. సోమవారం వెదుళ్ళపల్లి పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సర్కిల్‌ సీఐ బి. హరికృష్ణ వివరాలను వెల్లడించారు. గంజాయి తాగుతున్న చీరాల పట్టణం, రామ్‌నగర్‌కు చెందిన పేరం సాయిచంద్‌, చిలకలూరిపేటటౌన్‌ ఎన్‌టీఆర్‌ కాలనీకి చెందిన దేవరకొండ హేమంత్‌కుమార్‌, కడప టౌన్‌ నాగరాజుపేటకు చెందిన రావినూతల అచ్యుత్‌సాయికుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు తనదైన శైలిలో విచారించగా వారికి మండలంలోని వెదుళ్ళపల్లి గ్రామానికి చెందిన దేవి ఏడుకొండలరెడ్డి గంజాయి సరఫరా చేశారన్నారు. మొత్తం నలుగురిని అరెస్ట్‌చేసి కోర్టుకు హాజరు పరిచామన్నారు. వారి వద్ద నుంచి 190 గ్రాముల గంజాయి, వివో రెడ్‌ హ్యాండ్‌రైడ్‌ ఫోన్‌, రెండు నోకియా కీబోర్డ్‌ ఫోన్లు, ఒక లావా కీప్యాడ్‌ ఫోన్‌, రూ. 600 నగదు, టీవీఎస్‌ జూపీటర్‌ స్కూటర్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు. వెదుళ్ళపల్లి ఎస్‌ఐ ఎం. వెంకటేశ్వర్లు, విధుల్లో ప్రతిభ కనపరిచిన హెడ్‌కానిస్టేబుల్‌ తిరుపతిరాజు, అంకయ్య, కానిస్టేబుల్స్‌ రమేష్‌, రాజేష్‌లను ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement