నవ్యాంధ్ర రాజధానిలో ఫిజియోథెరపీ కళాశాల ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

నవ్యాంధ్ర రాజధానిలో ఫిజియోథెరపీ కళాశాల ఏర్పాటు చేయాలి

Jul 28 2026 2:00 AM | Updated on Jul 28 2026 2:00 AM

గుంటూరు మెడికల్‌: ఆర్థోపెడిక్‌ వైద్యుల ఆపరేషన్‌ల అనంతరం రోగికి పూర్తి స్వస్థత చేకూర్చే ఫిజియోథెరపిస్టుల గౌరవానికి తగ్గట్టు నవ్యాంధ్ర రాజధాని పరిధిలో ప్రభుత్వ ఫిజియోథెరపీ కళాశాలను ఏర్పాటు చేయాలని ది ఫిజియోథెరఫిస్ట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్ర ప్రదేశ్‌ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ బి వి. హరికృష్ణ, డాక్టర్‌ షేక్‌ సుభాని పేర్కొన్నారు. స్థానిక అరండల్‌పేటలోని ది ఫిజియోథెరఫిస్ట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన అత్యవసర కార్యవర్గ సమావేశంలో డాక్టర్‌ హరికృష్ణ, డాక్టర్‌ సుభాని మాట్లాడుతూ 2003లో స్థాపించిన ఫెడరేషన్‌ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో 98 కళాశాలలు ఉన్నాయన్నారు. ఏటా 2000 మంది విద్యార్థులు పట్టభద్రులై బయటకు వస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా 60 వేలకు పైగా ఫిజియోథెరపీ పట్టభద్రులు సరైన ప్రోత్సాహకాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు డాక్టర్‌ ఏడుకొండలు, డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, డాక్టర్‌ దయాకర్‌, డాక్టర్‌ శిరీష, డాక్టర్‌ మహినా, డాక్టర్‌ అనీస్‌ గ్రేస్‌, డాక్టర్‌ రవి వర్మ, డాక్టర్‌ తిరుపతిరావు, డాక్టర్‌ జనార్దన్‌, డాక్టర్‌ దుర్గా వరప్రసాద్‌, డాక్టర్‌ నూర్‌ భాష బాజీ, షేక్‌ షరీఫ్‌ ఉస్మాన్‌, డాక్టర్‌ పసల వినయ్‌ కుమార్‌, వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ది ఫిజియోథెరఫిస్ట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏపీ అధ్యక్ష, కార్యదర్శులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement