మరో మహిళతో..
నగరంపాలెం(గుంటూరు వెస్ట్):
ఉద్యోగాల పేరిట ఓ మహిళ రూ. లక్షల్లో కాజేసినట్లు బాధితులు వాపోయారు. చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే ఆమె తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. బాధితుల అర్జీలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను అలకించారు. బాధితుల నుంచి 194 ఫిర్యాదులు స్వీకరించారు. అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిర్యాదిదారులకు అన్న దానం నిర్వహించారు. జిల్లా ఏఎస్పీ జీవీ.రమణమూర్తి (పరిపాలన), డీఎస్పీలు శ్రీనివాస్‌రెడ్డి, బెల్లం శ్రీనివాసరావు, టి.సీతారాంలు కూడా అర్జీలు స్వీకరించారు.
12 ఏళ్ల క్రితం అమరావతి లేమల్లెకు చెందిన కానిస్టేబుల్‌తో పెళ్లైంది. ఒక పాప సంతానం. భర్త ప్రస్తుతం అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వేరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని 2018 నుంచి వేధింపులకు గురిచేస్తున్నాడు. ఎక్కడకక్కడే పోలీస్ అధికారులతో మాట్లాడుకుని, కేసుల్లేకుండా చూస్తున్నారు. అదనపు కట్నం కింద రూ.50 లక్షలు, పొలం రాసివ్వాలని ఒత్తిడి తెస్తున్నారు.
– బి.మహేశ్వరి, లేమల్లె, అమరావతి మండలం.


