గుంటూరు మెడికల్: పాత గుంటూరులోని శ్రీ దుర్గా భావన బెస్ట్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ షాప్‌లో సోమవారం జిల్లా విజిలెన్‌న్స్ కమిటీ సభ్యులు, ఫుడ్ సేఫ్టీ అధికారి నరసింహుడు తనిఖీలు నిర్వహించారు. షాపు నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ మున్సిపల్ ట్రేడ్ లైసెన్సు, లేబర్ లైసెన్సు లేకుండా విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఎలాంటి లైసెన్సు లేకుండా అమెరికన్ జనరల్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఐ సీ ఎం ఆర్ ధ్రువీకరించినట్లుగా బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అక్కడ ఉన్న బియ్యాన్ని శాంపిల్స్ తీసి షాపు నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. షాపు తనిఖీ చేసిన వారిలో జిల్లా విజిలెన్‌న్స్ కమిటీ సభ్యులు డాక్టర్ చదలవాడ హరిబాబు మునిపల్లి కవిత, అధికారులు ఉన్నారు.
అమెరికా బ్రాండ్‌తో బియ్యం విక్రయాలు


