భూ సమస్యలకు రీసర్వేతో శాశ్వత పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యలకు రీసర్వేతో శాశ్వత పరిష్కారం

Jun 21 2026 6:22 AM | Updated on Jun 21 2026 6:22 AM

భూ సమస్యలకు రీసర్వేతో శాశ్వత పరిష్కారం అమరావతి: భూముల్లో నిర్వహిస్తున్న రీ సర్వేలో రైతులను భాగస్వాములను చేసేలా ముందుగా సమాచారమిచ్చి వారి సమక్షంలోనే సర్వే నిర్వహించి, ఈకేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని రాష్ట్ర సర్వే, సెటిల్‌మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ అన్నారు. అమరావతి మండలం దిడుగు గ్రామంలో నిర్వహిస్తున్న రీసర్వే కార్యక్రమాన్ని ఆయన జిల్లా రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ రైతుల ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సర్వే మొదటిరోజున తప్పనిసరిగా సంబంధిత రైతు లేక వారి కుటుంబసభ్యులు క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. సర్వే పూర్తయిన తరువాత డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా సరిహద్దుల నిర్ణయం రైతు సమక్షంలోనే జరగాలన్నారు. రైతు చేతికి సరైన కొలతలతో కూడిన పట్టాదారు పాసుపుస్తకం అందజేసే వరకూ సమాచారం అందించటం అధికారుల బాధ్యత అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫేజ్‌–1లో 628, ఫేజ్‌–2లో 748, ఫేజ్‌–3లో 729, ఫేజ్‌–4లో 1645, ఫేజ్‌–5లో 1343 గ్రామాల్లో 2,800 సర్వే బృందాలు అత్యాధునిక సాంకేతిక పరికరాలతో సర్వే నిర్వహిస్తున్నాయని తెలిపారు. 2027 మార్చి నాటికి ఎటువంటి భూ వివాదాలకు తావులేకుండా రీ సర్వే చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సత్తెనపల్లి డివిజన్‌ సర్వే ఇన్‌స్పెక్టర్‌ ఎ.శివ శ్రీనివాసులు, మండల రెవెన్యూ, సర్వే సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. సమస్యల సత్వర పరిష్కారానికే విద్యుత్‌ అదాలత్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు పరిశీలన

రోణంకి కూర్మనాథ్‌

కొరిటెపాడు(గుంటూరు): వినియోదారుల సమస్యల సత్వర పరిష్కారానికి విద్యుత్‌ అదాలత్‌ ఎంతగానో ఉపయోపడుతోందని కన్జ్యూమర్‌ గ్రీవెన్స్‌ రెడ్రెస్సల్‌ ఫోరం(సీజీఆర్‌ఎఫ్‌) చైర్మన్‌ ఎన్‌.విక్టర్‌ ఇమ్మానుయేలు అన్నారు. గుంటూరు పొన్నూరు రోడ్‌లోని విద్యుత్‌ భవనం ఆవరణలోని సమావేశ మందిరంలో శనివారం విద్యుత్‌ వినియోగదారుల అదాలత్‌, అవగాహన సదస్సు నిర్వహించారు. వినియోగదారుల నుంచి వినతులు స్వీకరించారు. విద్యుత్‌ బిల్లుల్లో తప్పులు, స్తంభాల మార్పు, మీటర్‌ రీడింగ్‌లో లోపాలు, కొత్త కనెక్షన్ల జాప్యం, లో–ఓల్టేజీ, సోలిర్‌ పేమెంట్‌ క్రెడిట్‌ కాకపోవడం తదితర సమస్యలపై 12 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సీజీఆర్‌ఎఫ్‌ చైర్మన్‌ ఇమ్మానియేలు మాట్లాడుతూ వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి వివరాలతో స్పాట్‌లోనే పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అదాలత్‌కు వచ్చిన 12 ఫిర్యాదుల్లో 10 పరిష్కరించినట్లు తెలిపారు. వినియోగదారుల హక్కులు, విద్యుత్‌ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీజీఆర్‌ఎఫ్‌ సాంకేతిక సభ్యులు డి.కృష్ణనాయక్‌, ఆర్థిక సభ్యులు కె.కృష్ణ, స్వతంత్ర సభ్యులు ఏ.సునీత, ఎస్‌ఈ చల్లా రమేష్‌, అకౌంటెంట్‌ రామిరెడ్డి, డీఈఈలు, ఏఈలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నరసరావుపేట: అమృత భారత్‌ స్టేషన్‌ స్కీము(ఏబీఎస్‌ఎస్‌) కింద కోట్ల వ్యయంతో చేస్తున్న రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులను గుంటూరు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ సుధేష్ణసేన్‌ శనివారం పరిశీలించారు. స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన రెండో ప్లాట్‌ఫామ్‌ పైకప్పు, ప్లోర్‌ పనులు, మొదటి ప్లాట్‌ఫామ్‌ పొడిగింపు, హైలెవల్‌ బ్రిడ్జి, స్టేషన్‌ ముందు పనులను పరిశీలించారు. ఈనెలాఖరుకు ప్లాట్‌ఫామ్‌ పనులను పూర్తిచేస్తామని ఇంజినీర్లు చెప్పారు. లింగంగుంట్ల వైపు స్టేషన్‌సమీపంలో నివాసం ఉంటున్న గృహాలను పరిశీలించారు. నూతన రైల్వేట్రాక్‌, స్టేషన్‌ కొలతలను కొలిపించి పరిశీలించారు. అసిస్టెంట్‌ డీఆర్‌ఎం రమేష్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement