బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు

Jun 21 2026 6:22 AM | Updated on Jun 21 2026 6:22 AM

నెహ్రూనగర్‌: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎకై ్సజ్‌ శాఖ గుంటూరు డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు హెచ్చరించారు. శనివారం అరండల్‌పేటలోని ఎకై ్సజ్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025 జనవరి 1 నుంచి 2026 జూన్‌ 19 వరకు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో బహిరంగ మద్యపానంపై మొత్తం 1,136 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గుంటూరు జిల్లాలో 599 కేసులు, 604 మంది నిందితులుగా గుర్తించామన్నారు. పల్నాడు జిల్లాలో 537 కేసులకు గాను 561 మంది నిందితులుగా ఉన్నారన్నారు. జూన్‌ 19 ఒక్కరోజే రెండు జిల్లాల్లో కలిపి 45 కేసులు నమోదు చేసి 46 మందిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. బహిరంగంగా మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, ఇకపై కూడా ఇలాంటి వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ఇ. మారయ్యబాబు, గుంటూరు–1 స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ బి.లత తదితరులు పాల్గొన్నారు.

ఎకై ్సజ్‌ శాఖ గుంటూరు

డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ కె. శ్రీనివాసులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement