కర్లపాలెం: హత్య కేసులో బెయిల్‌పై బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కర్లపాలెం ఎస్‌ఐ రవీంద్ర తెలిపిన వివరాలు.. కర్లపాలెం మండల పరిధిలోని పెదపులుగువారిపాలెం గ్రామానికి చెందిన పులుగు రామకృష్ణారెడ్డిపై ఇద్దరు మహిళల హత్య కేసులు ఉన్నాయి. కోర్టు వాయిదాలకు హాజరు కావాలసిన రామకృష్ణారెడ్డి 36 నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయటంతో గాలించి శుక్రవారం కర్లపాలెం రూరల్ ఏరియాలో అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరు పరిచారు.


