మంగళగిరి టౌన్: పట్టణంలోని టిడ్కో గృహసముదాయంలో శుక్రవారం రాత్రి మత్తులో ఇద్దరు యువకులు బీభత్సం సృష్టించారు. ఒక ద్విచక్ర వాహనం ధ్వంసం చేయడంతో పాటు చిరువ్యాపారుల టిఫిన్ బండ్లను నాశనం చేశారు. టిడ్కో గృహసముదాయానికి చెందిన ఇద్దరు యువకులు మత్తుపదార్థాలు తీసుకుని ఈ ఘటనలకు పాల్పడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బందితో రక్షక్ వాహనం ఘటనా స్థలానికి చేరింది. పోలీస్‌సిబ్బంది ఆ ఇద్దరు యువకుల్ని అదుపు చేయలేకపోవడంతో ఎస్‌ఐకు సమాచారం అందించారు. పట్టణ ఎస్‌ఐ అక్కడకు చేరుకుని ఇద్దరు యువకులను ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గంజాయి, సొల్యూషన్ గానీ తాగి ఉండవచ్చని, ఇద్దరిలో ఒకరిని గతంలోనే ఇక్కడ ఉండవద్దంటూ పోలీసులు హెచ్చరించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇద్దరు యువకులు మైనర్లు అని, వీరు గతంలో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు సమాచారం.


