సాయికృష్ణ కుటుంబానికి పరామర్శ | - | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ కుటుంబానికి పరామర్శ

Jun 19 2026 2:06 AM | Updated on Jun 19 2026 2:06 AM

పొన్నూరు: విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కావడం, పోలీసులే చంపి, బూడిద కూడా లేకుండా చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో సాయికృష్ణ కుటుంబాన్ని గురువారం వైఎస్సార్‌ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ ఘటనపై నిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, బాధితులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఘటనపై ప్రభుత్వం పారదర్శక విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement